Followers

3వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ

3వ వార్డులో తెలుగుదేశం పార్టీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ

భీమిలి, పెన్ పవర్

తెలుగుదేశం పార్టీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భీమిలి జోన్ 3వ వార్డులో  రాష్ట్ర కమిటీ కార్యదర్శి,  భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా బయలుదేరి గంటస్థంభం వద్ద,చిన్న బజార్ జంక్షన్ లో  ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో   ముఖ్య అతిధిగా విచ్చేసిన 3వ వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ చేతులమీదుగా  పార్టీ జెండాను ఆవిష్కరించడమైనది.  నందమూరి తారకరామారావు నిలువెత్తు  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు,పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడమైనది.పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కార్పోరేటర్ గంటా అప్పలకొండ, రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు సంయుక్తంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టడమైనది.ఈ  సందర్భంగా కార్పోరేటర్ గంటా అప్పలకొండ మాట్లాడుతూ  తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో   పేద, మధ్యతరగతి, రైతులు, కర్షకులు గుండెల్లో నుండి పుట్టుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ అని అన్నారు. 

 1982  మార్చి 29వ తేదీన నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించి, పసుపు జెండాను పార్టీ జెండాగా ఆవిష్కరించి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేశారని అన్నారు.  పార్టీని స్థాపించి 9నెలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ రాజకీయాలను ఆకర్షించారని అన్నారు.దేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలను,కొన్ని జాతీయ పార్టీలతో కలిసి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఢిల్లీలో తెలువారి సత్తా చాటారని  గంటా అప్పలకొండ అన్నారు.రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చైతన్యం మొదలయిందని అన్నారు.మారుమూల గ్రామాల ప్రజలు  కూడా ఈరోజు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో  ఉన్నతమైన పదవులు పొందుతున్నారంటే అది ఒక్క నందమూరి తారకరామారావు చలవెనని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ అని,  ప్రజల క్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసిందని,ప్రజా సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిందని  అందుకే ప్రతీ తెలుగువారి గుండెల్లో తెలుగుదేశం చెరగని ముద్ర వేసిందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో  ఉండేటప్పుడు నందమూరి తారకరామారావు గాని, నారా చంద్రబాబునాయుడు గాని ముఖ్యమంత్రిగా  ఉండేటప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని అందులో  2రూపాయలకె కిలో బియ్యం పధకం నేటికి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి  ఉందని గంటా నూకరాజు అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చురకల రమణ,తెలుగు మహిళా రాష్ట్ర నాయకులు గోడి అరుణ,1వ వార్డు అధ్యక్షులు తమ్మిన సూరిబాబు,చిలకా నర్సింగరావు,కాసరపు నాగరాజు, పెంటపల్లి యోగీశ్వరరావు,మారోజు సంజీవకుమార్, కనకల అప్పలనాయుడు,కాసరపు ఎల్లాజి,కొక్కిరి అప్పన్న, కంచెర్ల కామేష్,వాడమొదలు సత్యారావు, పుక్కళ్ళ లక్ష్మీ కుమారి,సంకురుబుక్త జోగారావు, అప్పికొండ నూకరాజు,దాసరి వెంకటేష్, వియ్యపు పోతురాజు,వాసుపల్లి వంశీ,గండిబోయిన పోలిరాజు, కందుల సుందర్ రావు,పిల్లా రాజేష్,అల్లిపిల్లి గురువులు,అల్లిపిల్లి సతీష్, పిల్లా తాతారావు,  వాడమొదలు రాంబాబు,రాజగిరి రమణ, కరెంట్ రమణ,జరజాపు అచ్చిబాబు,సత్తరపు చిన్న,పరదేశి,  కొక్కిరి నూకరాజు,చింతపల్లి నూకరాజు,తాతారావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...