Followers

ఘనంగా టిడిపి 39వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

 ఘనంగా టిడిపి 39వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

పెన్ పవర్,  మల్కాజిగిరి

తెలుగు దేశం పార్టీ 39వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి, కుషాయిగూడ బస్టాండ్ ల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నంమూరి తారక రామారావు చిత్రపటనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి మిఠాయిలు తినిపించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి సంయుక్త కార్యదర్శి, డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రుద్రగోని రాంచందర్ గౌడ్, మల్కాజిగిరి పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ  జి. రాములు యాదవ్, సీనియర్ నాయకులు నిరుగొండ సతీష్, వట్టికొండ శ్రీధర్, ప్రసాద్, దర్శనం బాలయ్య, రాగీరు నాధంగౌడ్, కాసుల నందంగౌడ్, దర్శనం కృష్ణ,  శీలం సత్యంయాదవ్, పి. శ్రీనివాస్, ఆటో గిరి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...