ప్రజల మన్ననలు పొందుతున్న 37వ వార్డు టి.డి.పి కార్పొరేటర్ అభ్యర్థి బంగారి రవి శంకర్
మహారాణి పేట, పెన్ పవర్
జి.వి.ఎమ్.సి, దక్షిణ నియోజకవర్గం 37వ వార్డ్ టి.డి.పి, కార్పొరేటర్ అభ్యర్థి బంగారి రవి శంకర్ వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలపై శుక్రవారం పర్యటన చేపట్టారు.వార్డు టి.డి.పి అభ్యర్ధి అయిన బంగారి రవి శంకర్ వార్డు పర్యటనలో నిమిత్తం పెయిన్ దొర పేట, రెల్లి వీధి,జబ్బరి తోట, స్కీమ్ బిల్డింగ్స్, గొల్ల వీధి,తదితర ప్రాంతాల్లో పర్యటించి, వార్డు ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బంగారి రవి శంకర్ చేస్తున్నకార్యక్రమాలకు వార్డు ఆయన ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈకార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ కె.చిన్న,తెలుగు యువత ఉపద్యక్షులు తాతాజీ,వార్డు వైస్ ప్రెసిడెంట్ హేమలత,గంగమ్మ, సీనియర్ నాయకులు కనక రాజు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment