Followers

డాక్టర్. యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ను శాలువాతో సత్కరించిన 32వ వార్డు కార్పొరేటర్ కందుల

 డాక్టర్. యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ను శాలువాతో సత్కరించిన 32వ వార్డు కార్పొరేటర్ కందుల 

మహారాణి పేట, పెన్ పవర్

మహా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 32వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థి గా గెలుపొందిన కందుల నాగరాజు ను పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందించారు. ప్రముఖ సాహితీవేత్త,పార్లమెంట్ మాజీ సభ్యులు డాక్టర్. యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ను నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా లక్ష్మిప్రసాద్ మాట్లాడుతూ నాగరాజు వివిధ వర్గాలకు నిరంతరం అందిస్తున్న  సేవలను కొనియాడారు. కార్పొరేటర్ గా గెలిచిన నేపథ్యంలో మరిన్ని సేవలు ప్రజలకు అందించి అందరి మన్ననలు పొందాలని ఆకాoక్షిచారు. అంతకు ముందు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్. టి. సుబ్బరామిరెడ్డి, తెలుగు భాషా సంఘము చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, ప్రముఖ సినీ నటులు ఎం. మోహన్ బాబు తదితరులు ఫోన్ ద్వారా   కందుల నాగరాజు కు శుభాకాంక్షలు తెలియజేసారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశీర్వధించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...