32వవార్డులో దోమ తెరల పంపిణీ ముఖ్యఅతిథిగా వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు
మహారాణి పేట, పెన్ పవర్
అల్లిపురం మార్కెట్ మేడపైన మలేరియా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శనివారం దోమ తెరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు హాజరయ్యారు ఆయన చేతుల మీదగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి మురికివాడలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దోమలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అలా పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తూ మరియు దోమతెరలు కూడా వాడాలని అందుకే ప్రభుత్వం వారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దోమతెరలు పంపిణీ చేపట్టిందని వీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మలేరియా డిపార్ట్మెంట్ వారు సచివాలయం సిబ్బంది మరియు పార్టీ కార్యకర్తలు వరలక్ష్మి ఉమా,జానకి, లారా,పుట్నాల రమేష్,నీల బాబు,కిషోర్ మొదలైన వారు పాల్గొనడం జరిగినది.
No comments:
Post a Comment