Followers

జోరు పెంచిన 31 వ వార్డు టీడీపీ అభ్యర్ధి వానపల్లి

 జోరు పెంచిన 31 వ వార్డు టీడీపీ అభ్యర్ధి వానపల్లి..

ప్రత్యేక ఏజండాతో వార్డులో ప్రచారం..

విశాఖపట్నం,పెన్ పవర్

జీవీఎంసీ 31 వ వార్డు టీడీపీ అభ్యర్థి వానపల్లి రవికుమార్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రత్యేక ఏజండాతో వార్డు ప్రజానీకాన్ని కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు. వార్డులో వానపల్లి రవికుమార్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో కార్పోరేటర్ గా ఉన్న సమయంలో రవికుమార్ చేసిన సేవల గురించి చర్చించుకుంటున్నారు.కరోనా విపత్తులో చేసిన అన్నసమరాదన గురించి, పేద విద్యార్థులకు పీజులు చెల్లింపు, అనాధ శవాలకు దహణసమస్కారాలు ఇలా అనేక సేవల గురించి వార్డు ప్రజానీకం చర్చించుకుంటున్నారు. వానపల్లి రవికుమార్ గెలుపు తధ్యమని మహిళలు పేర్కొన్నారు.శుక్రవారం ఉదయం31 వ వార్డు పరిధి ఎల్లమ్మతోట,సాకలిపేట, బోడ్డునాయుడుతోట,ఎస్ బి ఐ కోలని, లలితా కోలని, అమరావతి లైన్, పార్క్ రోడ్, అల్లంవారి వీధి, విశ్వనాధం రోడ్, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు వానపల్లి రవికుమార్. వార్డు అభివృద్ధికి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వానపల్లి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో వార్డు అధ్యక్షులు సారిపల్లి మహేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వానపల్లి యువసేన సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...