Followers

ఏప్రిల్ 3న కొలువు తీరనున్న పంచాయితీ పాలకవర్గాలు

 ఏప్రిల్ 3న కొలువు తీరనున్న పంచాయితీ పాలకవర్గాలు

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

గ్రామ పంచాయతీలకు ఎన్నికైన నూతన పాలక వర్గాలు ఏప్రిల్ మూడో తేదీన కొలువుతీరి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డు మెంబర్లు ఆరోజున లాంఛనంగా ప్రమాణ స్వీకార లు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మూడో తేదీ ఉదయం 10:30 కి సచివాలయాలకు  సర్పంచులు వార్డు మెంబర్లు చేరుకొని  పితా గాంధీ మహాత్ముడు  డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజిస్తారు. 11 గంటలకు సర్పంచులు వార్డు మెంబర్లు చేత సచివాలయ కార్యదర్శులు  ప్రమాణ స్వీకారాలకు చేయిస్తారు.  11:30 కి ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం సమావేశమై చర్చిస్తారు. ఆ తర్వాత గ్రామంలో పర్యటించి అంగన్వాడి హెల్త్ సెంటర్ లు  ఇతరత్రా పరిశీలిస్తారు. ఆ తర్వాత మళ్లీ సమావేశమై తాగునీరు బోర్లు వీధి దీపాలు డ్రైనేజీలు ఇతర సమస్యలపై చర్చిస్తారు. త్వరలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా సేకరిస్తారు. నాటి నుంచి పంచాయితీలు  సర్పంచుల పాలనలో నడుస్తాయి. జిల్లాలో 969 పంచాయతీలకు గాను 962 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ పంచాయతీలకు నూతన పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి. ఈ మేరకు గ్రామ సచివాలయంలో హంగులు ఆర్భాటాలు కొత్త ఫర్నిచర్ ఏర్పాట్లు చేస్తున్నా రని  పంచాయతీ అధికారి వీ కృష్ణ కుమారి తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...