Followers

మార్చి 26న భారత్ బంద్ ను జయప్రదం చేయండి

 మార్చి 26న భారత్ బంద్ ను జయప్రదం చేయండి..

ఖమ్మం జిల్లా కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా సంఘాలు



ఖమ్మం, పెన్ పవర్

మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏఐటీయూసీ, సిఐటియు,ఐఎన్ టియుసి, ఐఎఫ్ టియు కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, మున్సిపల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, ఐఎన్ టియుసి ఖమ్మం నగర అధ్యక్షులు యం.డి.వై.పాషా,ఐఎఫ్ టియు జిల్లా కమిటీ సభ్యులు పెరబోయిన వెంకన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రఘునాధపాలెం మండల తాహసిల్ధార్ జి.నర్సింహరావుకు వినతి పత్రం అందజేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి రైతు జీవితంలో మట్టిపోస్తున్నదని, ఈ చట్టాలు అమలు జరిగితే రైతు నడ్డి విరిగి బజారునపడి,రైతును కూలీగా మార్చే మార్గానికి ప్రభుత్వం బాటలు వేస్తున్నదని విమర్శించారు..రైతు చట్టాలను ప్రకటించిన నాటి నుండి రైతులు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు చేస్తున్నారని. కానీ కేంద్ర ప్రభుత్వం అన్నం పెట్టే రైతు మాటలను పెడచెవిన పెట్టి ప్రజలను మోసం చేసి, సున్నం పెట్టే కార్పొరేట్ సంస్థలకు బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు.. మూడు రైతు చట్టాల అమలు మూలంగా రైతు తన భూమి మీద హక్కును కోల్పోయి కార్పొరేట్ దుర్మార్గాలకు బలికావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు..రైతు తాను పండించిన పంటకు సరైన ధరలేక కార్పొరేట్ సంస్థలు సృష్టించే సుడిగుండంలో పడి నష్టాలు ఎదుర్కొవల్సి వస్తుందని. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకోచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు.. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 26న జరిగే భారత్‌ బంద్ కు సహకరించాలని కోరారు అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ నుంచి పంచాయతీ ఉద్యోగ కార్మిక సిబ్బందికి వర్తించాలని కనీస వేతనం రూ. 12,000/-లుగా నిర్ణయించి చెల్లించాలని, ప్రభుత్వానికి నివేదిక పంపించి సిబ్బందికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పిట్టల మల్లయ్య, గుగులోతు రాందాస్, బి.మంగిలాల్, టి.ప్రసాద్, రాజగోపాల్, టి.సుధాకర్, వాసు, బి.రెణుకా, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...