Followers

మార్చి 26న ఆటోలు బంద్ ను పాటించి,ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండి

 మార్చి 26న ఆటోలు బంద్ ను పాటించి,ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండి

మధురవాడ, పెన్ పవర్

బి.జె.పి,ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ,వంట గ్యాస్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉ. మధురవాడ జంక్షన్ లో ఆటో డ్రైవర్లు  నిరసన కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ.పి,ఆటో మరియు మోటర్ వర్కర్స్ యూనియన్ ఎ.ఐ.టి. యు.సి, అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం డీజిల్ పెట్రోలు ధరలను భారీగా పెంచి ప్రజలపై భారాలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ప్రజలపై వేస్తున్న వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ 26.3.2021 న జరుగు భారత్ బందులో ఆటోలు,వ్యాన్లు,బస్సులు, లారీలు,కార్లు,జీపులు ఇంటివద్ద నిలిపివేసి ప్రభుత్వాలు కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కార్పొరేటీకరణ చేసే వ్యవసాయ నూతన చట్టాలను వెంటనే రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ 100%శాతం ప్రైవేటీకరణ రద్దు చేయాలని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని ప్రజల మీద వేసే ఆర్థిక భారాలను వెంటనే ఉపసంహరించాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి బి.జె.పి,ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు .మే నెల లో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో బి.జె.పి ని ఓడించి ప్రైవేటీకరణను రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రావి కృష్ణ, సి.హెచ్.రమేష్,ఆర్.శ్రీను,బి.గురయ్యా,అప్పలరాజు బి,బంగారు రెడ్డి,జి.రమణ,కొల్లి సన్యాసి రావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...