25న కిసాన్ మేళా...ఆర్ఏఆర్ఎస్ ఎడిటర్ భరత లక్ష్మీ
అనకాపల్లి ,పెన్ పవర్
అనకాపల్లి వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 25న కిసాన్ మేళ కార్యక్రమాన్ని నిర్వహించనునట్లు పరిశోధన సహాయ సంచాలకులు ఎం. భరత లక్ష్మి వెల్లడించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా అధునిక వ్యవసాయ పద్ధతులపై పరిజ్ఞానం పెంచేలా ఏటా ఈ మెళాను నిర్వహిస్తామని తెలిపారు. మేళా లో భాగంగా రైతుల ఉత్పత్తులను ప్రదర్శించేలా ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అతిథిగా వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఆహార తయారీ శాఖ మాత్యులు కురసాల కన్నబాబు పాల్గొంటారన్నారు. గౌరవ అతిథులుగా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొంటారన్నారు. వివిధ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు రైతులతో చర్చాగోష్టి నిర్వహిస్తారన్నారు. విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు అభ్యుదయ రైతులకు ఈ కార్యక్రమంలో భాగంగా సత్కారాలు చేయనున్నట్లు వెల్లడించారు.
No comments:
Post a Comment