కనీస వేతనం రూ 24 వేలు చెల్లించాలి
వేములవాడ, పెన్ పవర్
కనీస వేతనం రూ 24 వేలు చెల్లించాలని బుధవారం వేములవాడ మున్సిపల్ కార్యాలయం ముందు పురపాలక పారిశుధ్యం కార్మికులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ పారిశుద్ధ్య ఇతర విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 వేల రూపాయల కనీస వేతనాన్ని పెంచి అమలు చేయాలని, పట్టణ పారిశుద్ధ్యo కోసం కష్టపడే కార్మికులకు వేతనాలు పెంచాలని కోరారు. అర్హులైన వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి సమాజాన్ని భయ బ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితుల్లో మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు తమ, తమ కుటుంబ సభ్యుల ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావడం కోసం ప్రజలకు సేవ చేయాలని దృక్పదంతో అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను దేవుళ్లతో పోల్చి కనీసం మనుషులుగా గుర్తింపు ఇవ్వకపోవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం కార్మికుల శ్రమను గుర్తించి వేతనాన్ని 24 వేల రూపాయలకు పెంచాలని, పర్మినెంట్ కార్మికులకు ఇచ్చే సౌకర్యాలన్నీ కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తెడ్డు రాజశేఖర్ , మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment