Followers

21 వార్డ్ సచివాలయ సిబ్బంది తో వంశీకృష్ణ శ్రీనివాస్

 21 వార్డ్ సచివాలయ సిబ్బంది తో వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ తూర్పు, పెన్ పవర్

వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ 21 వార్డ్ పరిధిలో గల సచివాలయ సిబ్బంది తో  సమావేశంలో పాల్గొన్నారు. సీబీఐ సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బంది బొకే ఇచ్చి శాలువా వేసి స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమంలో  మాట్లాడుతూ వార్డ్ లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలు మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఉందని సూచించారు. 

వార్డ్ ను 98 వార్డులో ఉత్తమ వార్డ్ గా ఉండేందుకు అందరం కలిసి పనిచేయాలని అన్నారు. వార్డ్  పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సచివాలయ సిబ్బందికి తెలిపారు. వార్డ్ పరిధిలో  డ్రైనేజీ, వాటర్ మరియు సంక్షేమ ఫలాలు చేరవేయుటలో ప్రతి ఒక్కరు  కీలక పాత్ర పోషించాలని చెప్పారు.కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు రవి తో పాటు,సి.ఓ, శివ వార్డ్ ఎడ్మిన్ లు నానజీ ,శివశంకర్, జగదీష్ ,రవి మరియు సచివాలయ అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...