21వ వార్డులో సిపిఎం కార్యాలయం ప్రారంభం
పెద్దాపురం,పెన్ పవర్
పెద్దాపురం మున్సిపల్ ఎన్నికల్లో 21 నుండి సిపిఎం అభ్యర్దిగా పోటీ చేస్తున్న నీలపాల సూరిబాబు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే సిపిఎం పార్టీ తరపున పోటీలో ఉన్నామని. పట్టణంలో 4 వార్డులో పోటీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకోసం పోరాడడం సిపిఎంకే సాధ్యమని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు నాడోమాట, నేడోమాట చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. సిపిఎం గెలుపు ప్రజల గెలుపని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మెార్త రాజశేఖర్, బొట్టా సూరీడు, తణుకు సత్తిబాబు, దేవళ్ళ గోపాలం, జి సత్తిబాబు, ఎ.శ్రీను, పి. వినోద్, గంగరాజు, బాబ్జి, బాబురావు, ముంగర గోపి, గనేడి రామానాయుడు, సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్ పాల్గోన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు డి.సత్యనారాయణ, రాంబాబు, కృష్ణ, వీర్రాజు, తదితరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment