2030నాటికి క్షయవ్యాధి నిర్ములన జరగాలి
ఇంద్రవెల్లి, పెన్ పవర్
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు శ్రీకాంత్ మాట్లాడుతూ 1882 మార్చి 24వ తేదీన జర్మన్ శాస్త్రవేత్త డా.రాబర్ట్ కాక్ క్షయ వ్యాధికి కారణమైన క్రిమి మైక్రోబాక్టీరియం ట్యూబర్ క్యూలాసిస్ ను కనుగోని వ్యాధిని అరికట్టడంలో చాలా కృషి చేశారని దాని కారణంగా మనం ప్రతి ఏటా మార్చి 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా క్షయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 సంవత్సరం నాటికి క్షయ వ్యాధి నిర్ములనకు పిలుపునిచ్చిందని అన్నారు.అనంతరం క్షయ వ్యాధి పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించి భారత దేశంలో క్షయ వ్యాధి 2025 నాటికి ఒక్క కేసు కూడా నమోదు కావద్దని ఆశ కార్యకర్తలు కంకణబద్దంగా క్షయ వ్యాధి నిర్ములన కోసం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డెగావత్ శ్రీకాంత్, సీహెచ్ఓ. రాథోడ్ బాబులాల్, వైద్య సిబ్బంది జ్యోతి, మీర్జా, శ్రీనివాస్, వెంకటేష్, బలిరామ్, మరియు హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment