18లో బీజేపీ అభ్యర్ధి దూకుడు... పరేషన్ లో ప్రత్యర్ధులు
గెలుపు బాటలో 18 వ వార్డ్ బిజెపి మరియు జనసేన పార్టీ, ఉమ్మడి అభ్యర్థిని ద్వారపురెడ్డి అరుణ కుమారి
విశాఖ తూర్పు, పెన్ పవర్ :-
ఎన్నికల ప్రచారంలో భాగంగా 18 వ వార్డు లో పోటీ చేస్తున్న బి.జె.పి. మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ని ద్వారాపురెడ్డి ఎన్. ఎల్. అరుణ కుమారి ప్రచారాన్ని ఉధృత పరిచారు.తన ప్రచారంలో ఓటరు లెవ్వరూ అన్య పార్టీ ల ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలని, శాశ్వత అభివృద్ధికి దూరం కావద్దని హితవు పలికారు. వార్డు అభివృద్ధికి పట్టం కట్టే వ్యక్తులకు మాత్రమే ఓటు వేయాలని సూచించారు.
గత 20 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, స్థానికురాలు, విద్యావేత్త నైనా తనకు వార్డు సమస్యలన్నింటి పై పూర్తి అవగాహన ఉందని. వార్డు ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే వాటిని పూర్తిగా తీర్చగల సమర్ధత కలిగి ఉన్నానని, ప్రజలు ఆలోచించి తమ యొక్క అతి విలువైన ఓటును వేసి అత్యధిక మెజారిటీ తో అఖండ విజయాన్ని చేకూర్చాలని అభ్యర్దించారు. ఇంటింటికీ వెళ్లి నమూనా బ్యాలెట్ పేపర్ ను చూపించి అందులో 3వ వరుస సంఖ్య లో ఉన్న కమలం గుర్తు పై ఓటేసి గెలిపించమని కోరారు. వార్డులోని అన్ని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. మోడీ మాస్కులతో బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన రోడ్ షో ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ప్రచారంలో వయసుతో తారతమ్యం లేకుండా అన్నివర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కె. సుబ్రమణ్యం, వార్డు అధ్యక్షులు శ్యామ్ కుమార్, బాబ్జి, రామా రావు, జనరల్ సెక్రటరీ రమా దేవి, లలిత కుమారి, జాస్ని, నూకరాజు, చక్రవర్తి, మరియు జనసేన కార్యకర్తలు, బి.జె.పి కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment