18 వ వార్డులో బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపు రెడ్డి అరుణ కుమారి భారీగా ప్రచారం...
బి.జె.పి. ఉమ్మడి కార్పోరేట్ అభ్యర్దిని ద్వారాపురెడ్డి ఎన్. ఎల్. అరుణ కుమారి కి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు....
విశాఖ తూర్పు,పెన్ పవర్
ఇంటింటా ఎన్నికల ప్రచారంలో బాగంగా 18 వ వార్డ్ లో .. బి.జె.పి. ఉమ్మడి కార్పోరేట్ అభ్యర్దిని ద్వారాపురెడ్డి ఎన్. ఎల్. అరుణ కుమారి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.ఆటోలతో భారీ గా ర్యాలీ నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటేసి అభివృద్ధి కి అండగా నిలవాలని ప్రజలను అభ్యర్ధించారు. వార్డ్ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నా మన్నారు.నన్ను గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమం, వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రచారంలో అత్యధికంగా మహిళలు పాల్గొని అడుగడుగునా నీరాజనాలు అంధిoచారు.జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. , జనసేన కార్యకర్తలు మరియు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త కె.సుబ్రహ్మణ్యం,18 వ వార్డు అధ్యక్షులు శ్యామ్ కుమార్,జనరల్ సెక్రెటరీ రమాదేవి, లీలావతి, నూకరాజు, రామారావు, లాలితకుమారి శ్యామల,జ్యోతి యశోద, మరియు బి.జె.పి. జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment