Followers

18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారాపురెడ్డి అరుణకుమారి ని గెలిపించండి

 18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారాపురెడ్డి అరుణకుమారి ని గెలిపించండి

ఎం.పి రాజ్యసభ సభ్యులు జి.వి. ఎల్ నరసింహారావు పిలుపు

పెన్ పవర్,విశాఖపట్నం

యం. వి.పి కాలనీ తూర్పు నియోజక వర్గ బిజెపి కార్యకర్తల సమావేశం జామి ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమమునకు ఎం.పి  రాజ్యసభ సభ్యులు  జి వి యల్ నరసింహ రావు పాల్కొంటo జరిగింది 18వార్డ్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిని ద్వారపురెడ్డి అరుణకుమారి ని అత్యధిక మెజారిటీ తో గేలిపించలని కార్యకర్తలను కోరారు   ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధికి బీజేపీ చేసిన కృషిని చూసి ఓటు వెయ్యండి...బీజేపీ ... గత 6 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ నగర అభివృద్ధికి చేసిన విశేష కృషిని చూసి రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కోరారు.   ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి బీజేపీ కి ప్రాతినిధ్యం లేకపోయినా ప్రక్క రాష్ట్రాలనుంచి రాజ్యసభకి ఎన్నికై, పార్లమెంటులో రాష్ట్ర సమష్యల పట్ల పొరాడుతున్నామని, తమ శ్రమను గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమను ఆదరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు ధన రాజకీయాలు, భ్రమ రాజకీయాలు చేస్తూ రాష్ట్ర సమష్యల పరిస్కారంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖకు, రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్త్తున్న మన్నరు  విశాఖపట్నాన్ని దేశంలోనే మొదటి స్మార్ట్ సిటీగా ప్రకటించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. విశాఖపట్నంలో వైద్యపరికరాలను తయారీచేసే మెడ్టెక్ పార్క్ స్థాపించారన్నారు. 500కోట్ల రూపాయాలతో 350 పడకల సూపర్ స్పెషలిటీ ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నా మన్నారు. విశాఖపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గాగుర్తించి అభివృద్ధి చేస్తున్నా మన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాము, జనసేన తో కల్సి విశాఖలోని 98 వార్డుల్లో పోటీచేస్తున్నా మన్నారు. విశాఖ స్టీల్ నుసమర్ధ వంతంగా నడిపి లాభాల్లోకి తీసుకు రావడం కోసమే ప్రయివేటు కు అప్పగించాలనే విధానపరమైన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో . రామా,లీలావతి,శ్యామ్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ రవీంద్ర రెడ్డితదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...