Followers

16వ వార్డులో సైకిల్ స్పీడ్...

 16వ వార్డులో సైకిల్ స్పీడ్.....

నర్సీపట్నం, పెన్ పవర్ 

  నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డులో టిడిపి అభ్యర్ధి జంపన స్వరాజ్యలక్ష్మి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేంటిన్ రాజుగా పట్టణ ప్రజలకు సుపరిచితుడైన జంపన నాగేంద్రరాజు, అయ్యన్నపాత్రుడుకు అత్యంత సన్నిహితుడు. ఈ  సాన్నిహిత్యం వల్లే క్యాంటీన్ రాజు భార్య స్వరాజ్యలక్ష్మికి అయ్యన్నపాత్రుడు అవకాశం ఇచ్చారు. బి-ఫారం పొందిన రోజు నుండి వార్డులో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.  క్యాంటీన్ రాజు రోటరీ క్లబ్ లో అనేక పదవులు నిర్వహించి,  సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ప్రజలకు మరింత సేవ చేయాలంటే రాజకీయాలే ప్రధాన వేదికని,  అయ్యన్న  పిలుపు మేరకు కౌన్సిలర్ గా పోటీలో నిలబడ్డారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేఖ విధానాలను వివరిస్తున్నారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కౌన్సిలర్ గా తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు సమస్యల పట్ల వెంటనే స్పందిస్తానన్నారు. వార్డు శివారు వీధులకు సిమెంట్ రోడ్లు వేయిస్తానని, వీధులలో చెత్తకుండీలు ఏర్పాటు చేస్తానన్నారు. నిరంతరం పారిశుద్య పనుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. వైసిపి నాయకుల మాయమాటలు నమ్మవద్దని, ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి, ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని పెట్టారన్నారు. టిడిపి అభ్యర్ధిని జంపన స్వరాజ్యలక్ష్మిని గెలిపించి వార్డు సర్వతోముఖాభివృద్దికి సహకరించాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...