మార్చి 15 నాటికి నాడు -నేడు పనులు పూర్తి కావాలి
జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి
పెన్ పవర్, బ్యూరో (విశాఖపట్నం)
జిల్లాలో అమలు జరుగుతున్న నాడు నేడు పనులను మార్చి 15లోగా పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం ఏజెన్సీలోని పాడేరు జి.మాడుగుల మండలాల్లో జరుగుతున్న నాడు నేడు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో నాడు నేడు పనులను ప్రారంభించినప్పటికీ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నత్తనడక నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని పాలు మార్లు హెచ్చరించిన ప్రధానోపాధ్యాయులు చలనం కనిపించలేదు. దీంతో ఆగ్రహించిన డీఈవో ఏజెన్సీ లో జరుగుతున్న నాడు నేడు పనులపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా పాడేరు గుడివాడ ప్రభుత్వ పాఠశాలల వద్ద జరుగుతున్న నాడు నేడు పనులను తనిఖీ చేశారు. జి.మాడుగుల మండలం కే కూడా పల్లి ప్రభుత్వ పాఠశాల బాలుర గురుకుల పాఠశాల బాలికల మినీ గురుకులం పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు అమ్మ ఒడి పథకం యూనిఫారం పంపిణీ ఎంతవరకు జరిగిందని ఆయన అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు ఆశించినంతగా లేవని పెదవి విరిచారు. నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయాలు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట ఎంఐఎం కోఆర్డినేటర్ సత్య ప్రకాష్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ క్రాంతికుమార్ పాడేరు జి.మాడుగుల ఎం ఈ ఓ లు భూషణం సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment