మున్సిపాలిటీకి 12 లక్షలు వితరణ
పెన్ పవర్, కందుకూరు
కందుకూరు మున్సిపాలిటీకి స్వచ్ఛభారత్ లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంలో భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి గల రెండు ఆటోలకు 12 లక్షల రూపాయల చెక్కును పెరల్ డిస్టిలరీ యాజమాన్యం మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు మున్సిపాలిటీ విస్తీర్ణంలో పెద్దది ఆదాయం తక్కువ ఉండటంతో చెత్త సేకరణకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అడిగిన వెంటనే ఇంత పెద్ద మొత్తంలో అందజేసిన పెరల్ డిస్టిలరీ యజమాన్యం కు మున్సిపాలిటీ తరఫున మహీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విస్తీర్ణంలో ఒంగోలు కార్పొరేషన్ తో సమానంగా ఉందని ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కావడంతో దాతలపై ఆధారపడాల్సి వస్తుందని అడిగిన వెంటనే దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఇప్పటికే టి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల మౌలిక సదుపాయాలు లో భాగంగా 12 లక్షల రూపాయల విలువైన కంప్యూటర్లను అందజేసి ఈరోజు మరల మున్సిపాలిటీ కి రెండు అటోలకు 12 లక్షల రూపాయల చెక్కును అందజేసిన వారికి మహీధర్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
No comments:
Post a Comment