జీవోఎంఎస్110ని పునరుద్ధరణ చేయాలి
పాచిపెంట,పెన్ పవర్గతంలో రాష్ర్టా ప్రభుత్వం అమలు చేసిన జీవో నెం 110ని పునరుద్ధరణ చేయాలని సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు కోరారు. మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎంపిడివో కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు కనకల ఆదినారాయణ మాట్లాడుతూ జీవో నెం 2ని రద్దు చేసి జీవో నెం 110ని అమలు చేసే విధంగా రాష్ర్టా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త జీవో 2 వలన గ్రామ పంచాయతీ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుంది అని అన్నారు. అనంతరం స్థానిక ఎంపిడివో జి. రామారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment