Followers

కెటిఆర్ భర్త్ డే గిప్ట్ గా 108 వాహనం

 కెటిఆర్ భర్త్ డే గిప్ట్ గా 108 వాహనం

పెన్ పవర్,ఎల్లారెడ్డిపేట

మన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి  కేటీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా మన మండలానికి  108 అంబులెన్స్ మంజూరుచేశారనీ . మంజూరు చేసినందుకు మన మంత్రి  కెటిఆర్ కు ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు కృతజ్ఞతలు తెలిపారు.ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో  శనివారం 108 అంబులెన్స్ ను ఏంపిపి పిల్లి రేణుక రిబ్బన్ కత్తి రించగా .ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వేంకట్ రెడ్డి  టెంకాయలు కొట్టి  . జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు జెండా ఊపి 108 అంబులెన్స్ ను ప్రారంభించారు.  108 అంబులెన్స్ సిబ్బంది కి పోన్ చేస్తే వెంటనే స్పందించి సంఘటన  స్థలానికి వెనువెంటనే చేరుకొని  ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆసుపత్రిలకు తరలించి ఎందరియో  ప్రాణాలను కాపాడారని . మనకు అంబులెన్స్ వాహానం. సిబ్బంది ని మంజూరు చేసిన మన కళ్ళముందున్న దేవుళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్  మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని  ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు  అన్నారు.  ప్రమాదవశాత్తు గాయపడినవారిని. ప్రాణాపాయ పరిస్థితి లో  కొన ఊపిరి లో ఉన్న వారిని ఎందరినో వివిధ ఆసుపత్రులకు దైర్యంగా  తరలించి ఓ భాధ్యత గా   రక్షించిన 108 సిబ్బంది నీ చీటీ లక్ష్మన్ రావు అబినందించారు . 108 అంబులెన్స్ వాహనం లేనప్పుడు వివిధ యాక్సిడెంట్ లలో రోడ్లపై  ప్రమాదవశత్తు .గాయపడిన వారు కొన ఊపిరి లో   చాల మంది మరణించారనీ. వారి  కుటుంబాలు రోడ్డున పడ్డాయని. ఎందరో ఆనాదాలయ్యారన్నారు. 108 అంబులెన్స్ వాహనం .సిబ్బంది మంజూరైన తరువాత ఎన్నో మరణాలు తగ్గాయన్నారు.  108 అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎం పీ పీ  పిల్లి రేణుకయాదవ్.  ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ . ఎంపీటీసీలు ఎలగందుల అనసూయ.పందిర్ల నాగరాణి . వైద్యాధికారిని మానస.  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి. పిల్లి కిషన్ .టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి. శ్యామంతుల అనిల్ కుమార్.  వార్డ్ మెంబర్లు   పందిర్ల శ్రీనివాస్ గౌడ్ .జవ్వాజీ లింగం .సి హెచ్వో శ్రీనివాస్ రెడ్డి.  ప్రభుత్వ వైద్య సిబ్బంది 108 అంబులెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...