అంగన్వాడీ కేంద్రంలో గోడకూలి బాలుడు మృతి...
పెన్ పవర్ బ్యూరో (విశాఖపట్నం)..
అంగన్వాడి కేంద్రానికి వెళ్లిన ఓ చిన్నారి పై గోడకూలి మృతి చెందాడు. ఈ వార్త తెలిసిన వెంటనే తల్లితండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ముద్దులొలికే కించే చిన్నారి ఇక లేడని తెలిసి తల్లి కన్నీరు మున్నీరై కల్పిస్తుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని నర్సీపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రోలుగుంట మండలం ఎన్.కొత్తూరులో శుక్ర వారం ఉదయం సాయి అనే మూడేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు స్థానిక అంగన్వాడీ కేంద్రానికి పంపించారు. అంగన్వాడీ టీచర్ పిల్లలను గదిలో కూర్చోబెట్టి విధులు నిర్వహిస్తుండగా ప్రమాదు వశాత్తూ గోడ కూలిపోయింది. శిధిలాలు బాలుడి పై పడడంతో గాయాలై మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఐసిడిఎస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. రోలుగుంట పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
No comments:
Post a Comment