విశాఖ తూర్పు, పెన్ పవర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిన్న వాల్తేర్ లోని రెల్లి వీధి గ్రామ అధ్యక్షుడు, ప్రముఖ జర్నలిస్టు డాక్టర్. చెన్నా గౌరీశంకర్ ప్రతిష్ఠాత్మకమైన "మన తెలుగు తేజం జాతీయస్థాయి అవార్డు" కు ఎంపికయ్యారు. త్వరలో హైదరాబాద్ నగరంలో భారతదేశ మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సినీ రాజకీయ, ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నామని మన తెలుగు తేజం సంస్థ అవార్డుల కమిటీ కన్వీనర్ పీ.వీ. రమణ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 15 పివి అభిమాన సంఘాల పర్యవేక్షణలో 12 రంగాలకు చెందిన నిష్ణాతులకు, ప్రముఖులకు వారి సేవలను గుర్తించి మన తెలుగు తేజం జాతీయ స్థాయి అవార్డులను అందిస్తున్నామని పి.వి. రమణ గుప్తా పేర్కొన్నారు.ఈ అవార్డుల కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం, చిన్న వాల్తేర్ కు చెందిన డాక్టర్. చెన్న గౌరీ శంకర్ విద్య, పత్రికా రంగాలలో చేస్తున్న కృషిని అభినందిస్తూ "మన తెలుగు తేజం జాతీయస్థాాయి అవార్డుకు" ఎంపిక చేసినట్లు అవార్డుల కమిటీ కన్వీనర్ పి.వి.రమణ గుప్తా పేర్కొన్నారు. డాక్టర్. చెన్న గౌరీశంకర్ "మన తెలుగు తేజం జాతీయ స్థాయి అవార్డుకు" ఎంపిక కావడం పట్ల పలువురు స్పందిస్తూ ప్రతిభ ఉన్నవారికి అవార్డులు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు.
No comments:
Post a Comment