డ్రైనేజీలు పూడికతీత దుర్గంధం వెదజల్లుతోంది... దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి...పట్టీపట్టనట్లు అధికారులు
పెన్ పవర్ ఉలవపాడు
మండల కేంద్రమైన ఉలవపాడు లోని డ్రైనేజీ లోని పూడికతీత ను తొలగించటం మానివేశారు. మురుగు కుళ్ళిదుర్గంధం వెదజల్లుతూ ఉన్నాయి. ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీనికి తోడుగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా చిన్నపిల్లలు వృద్ధులకు దద్దుర్లు వచ్చి రోగాల పాలవుతున్నారు. ఉలవపాడు గ్రామం లోని ప్రతీ చోట డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి దుర్గంధం వెదజల్లుతూ ఉన్నాయి. ఇప్పటికైనా పట్టించుకుని డ్రైనేజీ లో పూడిక తొలగించి. దోమల నివారణ కై దోమల మందు పిచికారి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment