Followers

కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల మాఫియాను అరికట్టాలి ఎస్ ఎఫ్ ఐ

 కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల మాఫియాను అరికట్టాలి ఎస్ ఎఫ్ ఐ

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ..

 



కుత్బుల్లాపూర్/పెన్ పవర్;

 కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా అరికట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ లో భాగంగా శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కార్పొరేట్ విద్యాసంస్థల దగ్గర  విద్యార్థులు ,విద్యార్థుల తల్లదండ్రుల తో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఎం చంద్రకాంత్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి పరమేశ్వరి పాల్గొని మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా విపరీతంగా పెరిగిపోయిందని ఈ ఫీజులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని అన్నారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తుందని, ఫీజుల విషయంలో ద్వంద వైఖరి అవలంబిస్తోందని అన్నారు, కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజుల విషయమై ఎన్నిసార్లు పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పూర్తిస్థాయిలో కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని విద్యార్థులను ప్రజలను రైతులను పట్టించుకోవడం పూర్తిగా విఫలమైందని అన్నారు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఉపయోగపడే విధంగా జీవోలు విడుదల చేసి పూర్తిస్థాయిలో కార్పొరేట్ వ్యవస్థకు లాభంచేకూర్చేవిధంగా ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. కరోనా కారణంగా సంవత్సరం నుంచి పాఠశాలల్లో మూతబడితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది, ఫీజులు చెల్లించకుంటే అడ్మిషన్ రద్దు పేరుతో సర్టిఫికెట్ల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ మరి ఫీజులు గుంజుతున్న పరిస్థితి కార్పొరేట్ విద్యాసంస్థలలో నెలకొన్నది, మరి ఇంత  విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడకుండా కార్పొరేట్ వ్యవస్థకు మద్దతు పలుకుతూ ప్రజా వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసే విధంగా ఈనాడు కెసిఆర్ ప్రభుత్వం పూనుకుంటుంది. ప్రతి ఒక్క పేద మధ్య తరగతి విద్యార్థికి 50 శాతం ఫీజును ప్రభుత్వమే భరించాలని ఎస్ఎఫ్ఐ గా  ప్రభుత్వాన్ని కోరుతున్నాము, విద్యా సంస్థలలో  పుస్తకాల దందా విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి  చర్యలు తీసుకోవడం లేదు, ఈ పుస్తకాల దందా విషయంలో విద్యాశాఖ అధికారులు ప్రతి ఒక్క విద్యా సంస్థను  తనిఖీ చేసి ఇష్టానుసారంగా అధిక రేటుకు పుస్తకాలు అమ్ముతున్న విద్యాసంస్థలను రద్దు చేయాలని అదేవిధంగా అధిక ఫీజుల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల పై వెంటనే చర్యలు తీసుకోవాలని జీవో 46 ను అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాము ఫీజుల విషయంలో ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  భవిష్యత్తులో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వ వ్యతిరేక  ప్రజా విద్యార్థి ఉద్యమాలను చేపడతామని అన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల మాఫియాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఎం చంద్రకాంత్ ,పరమేశ్వరి ,నాయకులు గణేష్ ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...