సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలలో కౌన్సిలర్ శంకర్ నాయక్..
ప్రభుత్వ ఆదేశాలతోనే 27వార్డులో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు.. కమీషనర్ జ్యోతి..
దుండిగల్,పెన్ పవర్
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు పురస్కరించుకొని 27వ వార్డు పరిధిలోని దుందిగల్ తాండ-1లో ఘనంగా నిర్వహించారు.. ఈవేడుకలను దుండిగల్ మున్సిపల్ కమీషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి ప్రభుత్వం తరఫున.. ప్రభుత్వ ఆదేశానుసారం జయంతి వేడుకలు తామే ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమీషనర్ జ్యోతి తెలిపారు.. స్థానిక కౌన్సిలర్ శంకర్ నాయక్ జయంతి వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆలయ పూజారి వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో మరియు వరంగల్ జిల్లా ప్రధాన స్వామిజీ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో భోగ్ బండర్, అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బంజారాల సాంప్రదాయిక పద్దతిలో కమీషనర్ జ్యోతికి తలపాగ చుట్టి.. హోమం వద్ద అగ్నిహోత్రునికి నెయ్యితో కమీషనర్ అభిషేకం చేశారు..సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ కు కమీషనర్ నివాళులు అర్పించారు.. స్థానిక బంజారా మహిళలు కూడా జయంతి వేడుకలలో పాల్గొన్నారు.. తాండావాసులయ అతిధులను సత్కరించారు.. ముఖ్య అతిథిగా విచ్చేసిన 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ చౌహన్ సేవాలాల్ మహరాజ్ కు నివాళులు అర్పించారు.. ప్రభుత్వం తరుపున జిల్లా అడిట్ ఆఫీసర్ కొంగు వెంకటేష్, నాయకులు భీమ్ సింగ్ నాయక్, రవీందర్ నాయక్, మహేందర్ నాయక్, అమర్ సింగ్ లాల్ సింగ్ నాయక్, విజయ్ నాయక్, బాబులాల్ నాయక్ రాకేష్ నాయక్, బాబు నాయక్, రాములు నాయక్, మరియు తాండ పెద్దలు మహిళా మణులు ఈ భోగ్ బండర్ కార్యక్రమంలో పాల్గొన్నారు..
No comments:
Post a Comment