ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న,
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు
బేలలో చత్రపతి మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన, భారీ బైక్ ర్యాలీ, శోభాయాత్ర
బేలా (అదిలాబాద్), పెన్ పవర్బేలా:మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవలు యావత్ భారత దేశానికే గర్వకారణమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు లు అన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ 391 వ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తో కలిసి విగ్రహ ప్రతిష్టాపన, చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు శివాజీ మహారాజ్ డీజే పాటలతో భారీ ర్యాలీతో శోభయాత్ర నిర్వహించారు.
చిన్న పెద్ద తేడా లేకుండా మరాఠా కులస్తులు తో పాటు ఆయా యువజన సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొని జై భవాని జై శివాజీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న, సోయం బాపూరావు లు మాట్లాడుతూ, చత్రపతి మహారాజ్ తల్లి జిజావు స్ఫూర్తితో దేశంలోనే గొప్ప రాజుగా కీర్తి పొందిన స్ఫూర్తి ప్రదాత శివాజీ మహారాజ్ అని అన్నారు.చత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సేవలను మరాఠా, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని,ఆయన చేసిన సేవలను నిత్యం తలుచుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారని అన్నారు.
శివాజీ మహారాజ్ విగ్రహ దాత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ పవర్ ను ఎమ్మెల్యే, ఎంపీలు శాలువాలతో సన్మానించారు. విగ్రహాన్ని కొనివ్వడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీ. రామచంద్ర రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, స్థానిక జెడ్పిటిసి సభ్యురాలు అక్షిత సతీష్ పవార్, ఎంపీపీ వనితా గంభీర్ ఠాక్రె, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆడణేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవర్,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్ర శేఖర్, మాజీ సర్పంచులు మస్కె తేజ రావు, దేవన్న,మరాఠా సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్,మరాఠా సంఘం మండల అధ్యక్షులు ఠాక్రె గంభీర్,నాయకులు మురళీదార్ ఠాక్రె, నారాయణ చొప్డే,వైద్య కిషన్, నాక్లే రాందాస్, తేజ రావు వాడ్కర్, విపిన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment