Followers

సబ్బవరం కేంద్రంగా కలప అక్రమ రవాణా

 సబ్బవరం కేంద్రంగా కలప అక్రమ రవాణా.

 సబ్ డి ఎఫ్ ఓ ని తప్పుదారి పట్టించిన ఫారెస్ట్ సిబ్బంది

 స్మగ్లర్లకు  సహకరిస్తున్న పెందుర్తి సెక్షన్ ఆఫీసర్..

పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

 విశాఖ నగరానికి చేరువలో ఉన్న సబ్బవరం కేంద్రంగా కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్మగ్లర్లు  ఏజెన్సీ నుండి  విలువైన కలపను తెచ్చి  స్థానికంగా నిల్వచేసి బిల్డర్లకు సామ్మిల్లులకు సరఫరా చేస్తున్నారు. స్మగ్లర్లు భారీఎత్తున కలప వ్యాపారం చేయడానికి  స్థానిక ఫారెస్ట్ అధికారులు  పుష్కలంగా సహకరిస్తున్నారు. కలప పొరపాటున  ఎక్కడైనా పట్టుబడితే  స్మగ్లర్లను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆఖరికి అధికారుల ఆదేశాలను సైతం  పెడచెవిన పెట్టి  తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. అటవీ సంరక్షణ  కలప రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం నియమించిన అటవీశాఖ సిబ్బంది  స్మగ్లర్ల కాసులకు ఫిదా అయి  బాధ్యతలకు చెదలు  పట్టిస్తున్నారు. దీనికి 2 రోజుల క్రితం సబ్బవరం లో జరిగిన సంఘటనలు  అవినీతికి అద్దం పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే  సత్యనారాయణ సామిల్లు లో  భారీగా టేకు కలప ఉందన్న సమాచారం  అందుకున్న స్క్వాడ్ డి ఎఫ్ ఓ  పెందుర్తి సెక్షన్ ఆఫీసర్ సుధీర్ కి  కలప స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సామిల్లుకు పెళ్లి చూసి రావడం జరిగింది.  ఆ కలప ఏమైందో  తెలియడం లేదు.

 కానీ వాస్తవానికి అక్కడ ఉన్న కలప ప్రత్యక్షుల కంటి దృష్టి నుండి  చెరిగిపోలేదు.   మొక్కుబడిగా తీసుకువెళ్ళిన కలపకు ఇంతవరకు మెజర్మెంట్స్  పూర్తి కాలేదంటే   అక్కడ ఫారెస్ట్ ఉద్యోగుల పనితనం  అర్థమవుతుంది. ఈ సంఘటన జరిగిన మూడో రోజున  సబ్బవరం అనకాపల్లి రోడ్డులోని హీరో షోరూం ప్రక్కన శ్రీ మహాలక్ష్మి టైల్స్ షాపు ఎదురు సందులో తొమ్మిదో ఇల్లు పక్కన భారీ ఎత్తున టేకు కలప   సెక్స్తార్పాలిన్  కప్పి ఉంచారు.  ఈ కలప నిల్వపై సమగ్ర సమాచారం  సబ్ డి ఎఫ్  ధర్మ రక్షిత్ కు గురువారం సాయంత్రం  చేరింది. శుక్రవారం ఉదయం పెందుర్తి సెక్షన్ ఆఫీసర్ సుధీర్ కు కలపను పట్టుకో వలసిందిగా ఆయన ఆదేశించారు. నిల్వ ఉన్న కలపను చూసి  స్మగ్లర్ కు సహకరించాలనే ఉద్దేశంతో  ఇది హుదూద్ తుఫాన్ లో కలపని. కలప యజమాని శ్రీను  తమతో మాట్లాడతాడని  వెళ్ళిన ఫారెస్ట్ సిబ్బంది  అధికారికి సమాచారం  ఇవ్వడం జరిగింది. అధికారి తిరిగి ప్రశ్నించడంతో  గత్యంతరం లేక మరుసటి రోజు శనివారం  తప్పని పరిస్థితుల్లో  వెళ్లి  చెత్తాచెదారం లాంటి కలపను  వ్యానులో ఎక్కించు కు వెళ్లారు. వీరు అక్కడికి వెళ్ళే సమయానికే  విలువైన నాణ్యమైన కలప మాయం అయిపోయింది. ఇది జగమెరిగిన సత్యం ఫారెస్ట్ సిబ్బంది  వ్యానులో తరలించు  వెళ్తున్నా  కలప ను చూసి  ప్రత్యక్ష సాక్షులు నోరెళ్లబెట్టారు. ఇదిలా ఉండగా దేవరాపల్లి నుంచి ఇటీవల వచ్చిన  వేగిస కలప  లోడు కూడా  ఆకస్మాత్తుగా మాయమైపోయింది. స్థానికంగా  జోరుగా కలప అక్రమ రవాణా జరుగుతున్న సెక్షన్ ఆఫీసర్  బీట్ ఆఫీసర్ కు  తెలీకపోవడం విడ్డూరం. జిల్లా అధికారి  అప్రమత్తం చేసిన వీరు స్మగ్లర్లకు మద్దతు  పలుకుతున్నారు.

సబ్బవరంకి కలప ఎక్కడనుండి చేరుతుంది

  అనంతగిరి  దేవరాపల్లి  తదితర ఏజెన్సీ ప్రాంతాల నుంచి  టేకు  గన్న రా  వేగిస  ఆనేమ్  వంటి విలువైన కలపను నరికించి వాహనాల ద్వారా సబ్బవరం కి చేరుస్తున్నారు. ఇక్కడ సామిల్లు ల్లో  తగిన సైజులు కటింగ్ చేసి  నగరంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అపార్ట్మెంట్లు ఫర్నిచర్ యూనిట్లు   ఇతరత్రా అవసరాలకు ఆర్డర్లపై సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మహానగరంలో ఎక్కడ ఎటువంటి నిర్మాణం జరిగిన  ఇక్కడ నుంచే  కలప చేరవేస్తున్నారు. సబ్బవరం కి చెందిన  శ్రీను  అనే వ్యక్తి ఈ కలప అక్రమ రవాణాకు  సూత్రధారి అని అటవీ శాఖ సిబ్బందికి తెలుసు  కానీ  ఎంత విలువైన కలప పెద్ద మొత్తంలో తెచ్చిన  సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.  ఈ స్మగ్లింగ్ పై జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి  చూడాల్సిందే.. 

     స్మగ్లర్ పై  చర్యలు తీసుకుంటాం.

 సబ్బవరం లో భారీగా కలప స్మగ్లింగ్ పై  ఫారెస్ట్ కన్సర్వేటర్  మోహన్ రావు ని  ప్రస్తావించగా  కలప అక్రమ రవాణా  తన దృష్టికి వచ్చిందని. విచారణ జరిపించి  కలప స్మగ్లర్  మరియు సహకరించిన వారిపై కూడా  చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...