కొవిడ్ వ్యాక్సిన్ పై అపోహలొద్దు... ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి, పెన్ పవర్ :
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు శనివారం రెండో విడత వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పట్ల జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అపోహలకు పోవద్దని తెలియచెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ 19 ఇప్పటికీ తన ప్రభావం చూపుతూనే ఉందని కావున ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం కూడదని ఆయన సూచన చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తమకు ఏ విధమైన దుష్పరిణామాలు ఎదుర్కోలేదని ఎమ్మెల్యే వెల్లడించారు.
No comments:
Post a Comment