రైతు భరోసా కేంద్రంలో రబీ సీజన్ కు అవసరమైన శిక్షణ
తాళ్ళపూడి, పెన్ పవర్,
వైయస్సార్ ఉచిత పంటల భీమా పథకంలో భాగంగా వరి మరియు మొక్కజొన్న పంటలు తాళ్ళపూడి మండలంలో సెలెక్ట్ అయ్యాయి. దానిలో భాగంగా శిక్షణా కార్యక్రమం
మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఎఓ జి.రుచిత అధ్యక్షతన శనివారం జరిగింది. ఎయస్ఓ జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ సహాయకులు, ఉద్యానవన సహాయకులకు రబీ సీజన్ విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన శిక్షణ అందించారు. వరి మరియు మొక్కజొన్న యూనిట్ నంబర్లు, రాండమ్ నంబర్లు వారికి అందించి, వారు ఫారాలు ఎలా పూర్తిచేయాలని కూలంకషంగా వివరించడం జరిగింది. ఏ ఇబ్బందులు ఉన్న వ్యవసాయ అధికారిని దృష్టికి తీసుకురావాలని, ఏ పంట నష్ట పోకూడదని, ప్రయోగాలు పారదర్శకంగా ఉండాలని, భాద్యతగా వ్యవహరించాలని సూచనలు ఇచ్చారు. ఎఒ జి.రుచిత మాట్లాడుతూ ఈ వారంలోపే ఫారం 1 లను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎఎలు, విహెచ్ఎలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment