శాశ్వతమైన భూ హక్కు కల్పించేందుకే జగనన్న భూరక్ష -తహసీల్దార్ జి.చిన్నారావు
గండేపల్లి, పెన్ పవర్శాశ్వతమైన భూమి హక్కు కల్పించేందుకు జగనన్న భూరక్ష పథకం ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు గండేపల్లి తహసీల్దార్ జి చిన్నారావు, సెంట్రల్ సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్ పైలెట్ బసవరాజు లు అన్నారు. గండేపల్లి మండలం బొర్రంపాలెం లో సెంట్రల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరా ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ చిన్నారావు,బసవరాజు లు మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం భూ సర్వే నిర్వహించారని, తదనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి భూ రక్షా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే నిర్వహించి రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. రైతులు ప్రతీ ఒక్కరూ ఈ సర్వేకు సహకరించాలని సూచించారు. పెద్దాపురం డివిజన్ ఇంచార్జి డి ఐ షఫీ మాట్లాడుతూ మండలంలోని 19 మంది గ్రామ సర్వేయర్ లు భూ సర్వే నిర్వహించి సరిహద్దులను ఏర్పాటు చేయడమే కాకుండా జియో ట్యాగ్ చేయడం జరిగిందని తద్వారా డ్రోన్ కెమెరా ద్వారా సరిహద్దులను పరిశీలించి భూ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. గంటకు 500 నుంచి 600 ఎకరాలు డ్రోన్ కెమెరా ద్వారా సర్వే చేయడం జరుగుతుందన్నారు. రైతులు ప్రతి ఒక్కరు భూ సర్వే సద్వినియోగం చేసుకుని శాశ్వత భూహక్కు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బొర్రంపాలెం మాజీ సర్పంచ్ పల్లపు విష్ణు, సర్పంచ్ సుబ్బారావు, డిప్యూటీ తాసిల్దార్ సరిత, ఆర్ ఐ నాగేశ్వరరావు, సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment