Followers

మండల కేంద్రంలో సీఐటీయూ, గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో రహదారి పై రాస్తారోకో

మండల కేంద్రంలో సీఐటీయూ, గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో రహదారి పై రాస్తారోకో









 గూడెం కోత్తవీధి పెన్ పవర్

62 మంది శాసనసభ్యులు, 8 మంది ఎంపీలు రాజీనామా చేయటంతో పాటు 32 మంది ప్రాణత్యాగాలు ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ కానివ్వదంటూ సిఐటియు అధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు,ఈ కార్యక్రమంలో మండల సీఐటీయూ కార్యదర్శి అంపురింగి బుజ్జిబాబు మాట్లాడుతూ 62 గ్రామాల నిర్వాసితులు నుండి 22 వేల ఎకరాల భూమిని సేకరించి ఏర్పాటు చేసిన ఉక్కు కర్మాగారం ను కేంద్రంలో పాలక పార్టీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు కుట్రలు చేస్తుందని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెచ్చుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులుపరంకాకుడా కాపాడుకుందామన్నారు, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ మెంబర్ సలిమితి సాంతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట‌‌‌ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదవారికి, మధ్యతరగతి కుటుంబాల పై పెను భారం మోపిందన్నారు, ప్రభుత్వం రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయడం, నిత్యావసర సరుకుల పై ధరలు విపరీతంగా పెంచినా ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కించుకుందనిన్నారు, వ్యవసాయానికి కూడా ప్రైవేటు చేయడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకుని వచ్చి ఆదాని, అంబానీలకు కట్టబెలని చూస్తుందని, ఉక్కు కర్మాగారంను ప్రభుత్వం రంగంలో నడిపించాలని ఆమె డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో రహదారి పై రాస్తారోకో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లోత కన్నబాబు, మండల ఆర, ఎం, పి సంఘం అధ్యక్షుడు గోపి, మండల పిటిజి సంఘం అధ్యక్షుడు వంతల చంటి, మండల వాలంటీర్లు సంఘం అధ్యక్షుడు దుచ్చరి కోటి, మండల ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...