Followers

కేంద్ర బడ్జెట్ పై రౌండ్ టేబుల్ సమావేశం

 కేంద్ర బడ్జెట్ పై రౌండ్ టేబుల్ సమావేశం

ఆర్థిక సామాజిక భద్రత చూపని కేంద్ర బడ్జెట్

విజయనగరం, పెన్ పవర్

దళిత్ ఆర్థిక అధికార ఆందోళన్ మరియు దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో  కేంద్ర బడ్జెట్:దళిత ఆదివాసీ ల అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బడ్జెట్ విశ్లేషకులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో దేశ ప్రజలకు ఆర్థిక,సామాజిక భద్రత కల్పించడంలో   విఫలమైంది అని అన్నారు. ప్రభుత్వ రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో సామాజిక న్యాయానికి  ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు.కేంద్ర మొత్తం బడ్జెట్లో 126259 కోట్లు ఎస్సీలకు, 79942 కోట్లు ఎస్టీ లకు కేటాయించి చేతులు దులుపుకున్నది. జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపుల జరపక పోవడం వలన నేరుగా ఉపయోగపడని పథకాలకు కేటాయించక పోవడం వలన ఎస్సీలు 112863 కోట్లు,ఎస్టీ లు 60247 కోట్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.ప్రభుత్వరంగ సంస్థ ల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నించడం వల్ల సామాజిక న్యాయం దెబ్బతిని ఎస్సీ,ఎస్టీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు.కావున తక్షణమే క్రింది సిఫార్సులు ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి దళిత ఆదివాసీ సాధికారత కు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

1. ఆర్థిక భద్రత,సామాజిక భద్రత కల్పించేలా దిశగా నిధులు కేటాయించాలి

 2. ఎస్సీ, ఎస్టీ మహిళలకు వివిధ పథకాల్లో 50%  నిధులు కేటాయించి, అమలు కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

 3.వికలాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మౌలిక వసతులు కల్పించాలి

 4.కేంద్రం తక్షణమే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలి

 5.ఉన్నత విద్యకు బడ్జెట్ లో నిధులు పెంచాలి

6. సబ్ ప్లాన్ నిధుల పై సామాజిక తనిఖీ నిర్వహించాలి

7.ప్రభుత్వ రంగ సంస్థ లను బలోపేతం చేయాలి. ప్రైవేటీకరణను విరమించుకోవాలి. 

8. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని,పౌర హక్కుల పరిక్షణ చట్టాన్ని అమలుకు నిధులు కేటాయించాలి.

ఈ కార్యక్రమంలో లోక్ సత్తా జిల్లా అద్యక్షులు టి రాజారావు, జిల్లా అభివృద్ధి వేదిక అద్యక్షులు పి.షణ్ముఖ రావు, దళిత హక్కుల పోరాటసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోక రమేష్ ,మాజీ ఎంపీ టి సి కింతడా రవికుమార్, DBSU జిల్లా అధ్యక్షులు పి. సత్యవతి, కార్యదర్శి రాయి ఈశ్వరరావు, హ్యూమన్ రైట్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వరప్రసాద్,దళిత ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిదులు గుజ్జల లావణ్య,సివికి కాలిబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...