తూర్పులంక సర్పంచ్ అభ్యర్థి కడలి గంగాచలం ప్రచార జోరు
అల్లవరం, పెన్ పవర్
మండలంలో తూర్పులంక గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా కడలి గంగాచలం ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఎలక్షన్లలో ఈసారి ఒక అవకాశాన్ని గ్రామ ప్రజలు ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తానని వారు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రధానంగా త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని అలాగే సిసి రోడ్లు తీసుకు వస్తామనీ కడలి గంగా చలం ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా ఉదయం తూర్పులంక ఇంటింటికి తిరిగి ప్రచారం చేసారు. సర్పంచ్ అభ్యర్థి కడలి గంగా చలం ఇంటికి వెళ్లి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment