అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తాం
గూడెం కోత్తవీధి, పెన్ పవర్
మండల కేంద్రమైన గూడెం కోత్తవీధి పంచాయతీ, మారుమూల గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుస్తుమని కొత్తగా ఎన్నికైన సర్పంచ్ కొర్రా సుభద్ర ధీమా వ్యక్తం చేశారు, సుభద్రని పెన్ పవర్ విలేఖరి ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు, ఈ సందర్భంగా సర్పంచ్ కొర్రా సుభద్ర మాట్లాడుతూ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీగా గూడెం కోత్తవీధి ఉందని గత పలుకుల హయాంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమైనట్లు ఇక్కడి పరిస్థితి చూస్తుంటే తెలుస్తోందన్నారు, మండల కేంద్రమైన పంచాయతీ కేంద్రంలో ప్రజలు అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నారన్నారు, వీరందరికీ అవసరమైన డ్రైనేజీ, ఇంటింటికి కొల్లాయిలు, కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు, ముఖ్యంగా పంచాయతీ పరిధిలో చిన్న చిన్న మారుమూల గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయని అన్ని చోట్ల అందరికీ అవసరమైన తాగునీరు, ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు, అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు,ఇతర వసతులు కల్పించి మండలంలోనే ఆదర్శంగా నిలవాలన్నదే తమ ధ్యేయమన్నారు, మండల కేంద్రంలో డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్లు పై నిత్యం మురుగు నీరు ప్రవహించి అపరిశుభ్రంగా ఉంటోందన్నారు, ఇక్కడ చేపడుతామన్నారు, అలాగే వీధుల్లో సీసీ రోడ్లు,డ్రైనేజీలు, తాగునీరు, నిత్యం వీధి లైట్లు వెలిగేలా సంబంధిత అధికారులకు తెలుపుతామన్నారు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో సర్పంచ్ పీఠం ఎక్కే అవకాశం వచ్చిందని అన్ని విధాలా అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు,అలాగే ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సహకారంతో ప్రజలకు అవసరమైన సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు
No comments:
Post a Comment