Followers

హమాలీలను దోచుకుంటున్నా ప్రభుత్వం

 హమాలీలను దోచుకుంటున్నా ప్రభుత్వం

 మహబూబాబాద్ ,పెన్ పవర్ ;

పెంచిన హమాలీ రేట్లను అమలు చేయకుండా ప్రభుత్వం హమాలీల శ్రమను దోచుకుంటోందని ఏఐటీయూసీ మండల కార్యదర్శి మంద భాస్కర్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం ఎదురుగా ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లయిస్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో కళ్లు, చెవులు ,నోరు మూసుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంద భాస్కర్ మాట్లాడుతూ దారిద్ర్య  రేఖకు దిగువనున్న ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యం ను సకాలంలో చేర్చేందుకు హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు హమాలీలకు పెరగాల్సి ఉండగా గత సంవత్సరం నవంబర్ రెండున నూతన రేట్ల   విషయమై సివిల్ సప్లై అధికారులు మరియు యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి చర్చించి ఎగుమతి దిగుమతి క్వింటా ఒక్కంటికి 18 రూపాయలనుండి23 రూపాయల వరకు పెంచి ఆమోదం తెలిపారన్నారు.పెంచి నాలుగునెలలు అవుతున్నా నేటికీ అమలు చేయడంలో గానీ,జీవోను విడుదల చేయడం లో  ప్రభుత్వం మరియు సివిల్ సప్లయ్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హమాలీలు శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఒప్పందం ప్రకారం నూతన రేట్లు అమలు చేసేదాకా  నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుంటే ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే రేట్లు దేనికి సరిపోవని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని ,హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనివ్వవ, గత ఒప్పందం ప్రకారం ఈఎస్ఐ సౌకర్యం తక్షణమే  కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు వడ్డెబోయిన లక్ష్మీనర్సయ్య, బుక్యా వీరన్న,నరముల యాకయ్య ,  యాకూబ్ రెడ్డి , సూరారెడ్డి, రాజు' శ్రీను , భిక్షపతి, వెంకన్న,మాణిక్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...