నిర్వాసితుల భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని - ఆర్ కార్డు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి
నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ఇచ్చిన భూములు నేడు ప్రైవేటీకరణ చేస్తారు కాబట్టి నిర్వాసితుల భూములు తిరిగి వెనక్కి ఇవ్వాలని నిర్వాసితులు ఉద్దేశించి ఎమ్మార్వో కార్యాలయం దగ్గర, గాజువాకలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి. రామ్ శుక్రవారం మధ్యాహ్నం ప్రసంగించారు.ఆనాడు మొత్తం 22 వేల ఎకరాల భూమి రైతుల దగ్గర తీసుకున్నారు అందులో 13 వేల ఎకరాలు స్టీల్ ప్లాంటు నిర్మాణానికి క్వార్టర్స్ , పార్కుల, విద్యాలయాలు పెట్రోల్ బంకులు చేపట్టారు మిగిలిన తొమ్మిది వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉంది కాబట్టి ఆ భూములు నిర్వాసితులకు పంపిణీ చేయాలని రామ్ డిమాండ్ చేశారు.స్థానికులకు అవకాశం కల్పించకుండా పక్క రాష్ట్రాలైన ఒరిస్సా , బీహార్ , వెస్ట్ బెంగాల్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పటికైనా సరే ఏవైతే ఆర్ కార్డు నిరుద్యోగ సమస్య ఉన్నాయో 8500 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment