Followers

బొగ్గు గని కార్మికులను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు


 బొగ్గు గని కార్మికులను మోసం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

మందమర్రి/ పెన్ పవర్ :

బొగ్గు గని కార్మికులకు ఆదాయపన్ను రద్దు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తున్నాయని సిఐటియు నాయకులు ఆరోపించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బొగ్గు గని కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని పార్లమెంటులో స్పష్టం చేయగా, ఆదాయపు పన్ను రద్దు కోసం గతంలో తీర్మానం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో గల వేజ్ బోర్డు ఒప్పందం ప్రకారం సింగరేణిలో కార్మికులకు అలవెన్సులపై ఆదాయపు పన్ను రద్దు అమలు చేసేలా యాజమాన్యాన్ని ఆదేశించకుండా కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పై తన వైఖరి తెలియపరచకుండా, సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నందని ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ, కొత్త బొగ్గు బ్లాకులు రాకుండా వేలంపాట  పేరుతో సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం తగ్గించి, కార్మికులకు ఆర్థికంగా నష్టం కలిగించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రామగిరి రామస్వామి, మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, నాయకులు ఏ శ్రీనివాస్, వి ఐలయ్య, సంజీవ్, ప్రవీణ్, రాజమల్లు, అరిఫ్, సింగ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...