Followers

గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..

 గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

గర్భిణిని దహనం చేసిన బూడిదలోని నగల అవశేషాలను దొంగిలించటానికి ప్రయత్నించి నలుగురు అడ్డంగా బుక్కయ్యారు. గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆలస్యంగావెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోలాపూర్‌ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్‌ హన్వంతే, రుక్మిణి, రామచంద్ర కస్బే, స్వాతిలు తమ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన మరణించిన ఓ గర్భిణి అంత్యక్రియలు బంగారు నగలు మృతదేహంపై ఉంచి చేస్తారని వారికి తెలిసింది.  గర్భిణి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో కరిగిన బంగారాన్ని దొంగిలించాలని వారు నిశ్చయించుకున్నారు. బుధవారం అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో నగల అవశేషాల కోసం వెతకుతూ.. గ్రామస్తుల కంట బడ్డారు. దీంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఓ గ్రామస్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...