అగ్ని ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధం
గోకవరం, పెన్ పవర్
మండలంలోని ఇటికాల పల్లి శివారు గోపాలపురం గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి.కరెంటు షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ రెండు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమై కోమలి సత్తిబాబు, షేక్ లక్ష్మీదేవికి చెందిన కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలియవచ్చింది. అగ్నిప్రమాదంలో ఇంటిలో ఉన్న ఫ్రిడ్జ్, బీరువా, రెండు బైకులు, గ్యాస్ స్టవ్, కుట్టు మిషను, డబుల్ కాట్ మంచం, కర్రల కోసే మిషన్, బంగారం వెండి వస్తువులు తదితర సామాగ్రిని పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాద బాధితులను ఇటికాయల పల్లి చెందిన ఎంపీటీసీ అభ్యర్థిగా గళ్ళాకృష్ణ పరామర్శించారు .
No comments:
Post a Comment