Followers

డ్యాన్స్ షో కోసం ఏకంగా అనకొండను పెంచుకున్నాడు..

డ్యాన్స్ షో కోసం ఏకంగా అనకొండను పెంచుకున్నాడు..

 ఇక్కడే పాలకొల్లు కుర్రాడి ప్లాన్ బెడిసి కొట్టింది..

పాలకొల్లు,పెన్ పవర్

స్నేక్‌డ్యాన్స్‌తో షేక్‌ చేయడానికి తీసుకొచ్చాడు అనకొండని. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లక్ష్మినగర్‌లోని ఓ ఇంట్లో ఈ భారీ కొండచిలువని చూసిన స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. దీంతో బాత్రూంలో నక్కిన పైథాన్‌ ఇలా బయటికొచ్చింది.అవీ ఇవీ పెంచుకుంటే కిక్కేముంటుంది. నా రూటే సెపరేటంటూ ఏకంగా పామును పెంచుతున్నాడో కుర్రోడు. చిన్నబుట్టలో పట్టే పాము కాదు…బస్తాలో పట్టనంత కొండచిలువని చూశారుగా ఎంతుందో. 11 అడుగులు. ఆదమరిస్తే మేకల్నీ, గొర్రెల్నీ కూడా మింగేసేంత సైజు. ఇదేం పోయే కాలంరా నాయనా అంటే…ప్రోగ్రామ్స్‌ ఇవ్వడానికి ముచ్చటపడి తెచ్చుకున్నానని చెబుతున్నాడు.  కారుమంచి గంగాచలం అనే వ్యక్తి ఇంట్లోంచి 11 అడుగుల కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు అటవీఅధికారులు. స్నేక్‌డ్యాన్స్‌కోసం ఆ కొండచిలువను తీసుకొచ్చి బాత్రూంలో దాచాడు పెరవలికి చెందిన అతని మిత్రుడు భగవాన్‌. 8నెలల వయసున్న ఈ కొండ చిలువ బరువు 45 కిలోలుంది. ఇళ్లమధ్యలో కొండచిలువను తీసుకొచ్చి ఉంచిన విషయం తెలియటంతో దాన్ని చూసేందుకు జనం వచ్చారు. మొత్తానికి అధికారులు అనకొండని పట్టుకుపోవటంతో…అంతా ఊపిరిపీల్చుకున్నారు.

 వన్యప్రాణి సంరక్షణ చట్టం..

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణుల వేట నిషేధం. ఈ చట్టం వచ్చాక దేశవ్యాప్తంగా 23 టైగర్‌ ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో 441 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలున్నాయి.  అన్ని రకాల వన్య ప్రాణులను రక్షించుకోవటమే వన్యప్రాణి సంరక్షణ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. ఇదిలావుంటే.. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇది పెద్ద నేరమని.. చట్టంలో షెడ్యూల్‌ 1, 2 కింద అనకొండ వస్తుందని అటవీశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.1973 మార్చి 1వ తేదిన వైల్డ్‌లైఫ్‌ యాక్ట్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. అడవిలో వన్యప్రాణులను వేటాడినట్లు నిర్ధారణ అయితే శిక్ష 3 నుంచి 7 సంవత్సరాలతో పాటు రూ.27 వేలు జరిమానా ఉంటుంది. షెడ్యూల్‌-1: షెడ్యూల్‌-1 కింద పెద్ద పులి, నెమలి, చిరుత కృష్ణజింక, ఎనుగు, క్రూర మృగాలు వస్తాయి. షెడ్యూల్‌-2 కింద కొండ గొర్రె, దుప్పి, ఎలుగుబంటి, నక్కలుపాములు, అడవి కోడి, రేసు కుక్కలు వస్తాయి.షెడ్యూల్‌-3 కింద కుందేళ్లు, ఉడతలు, పావురాళ్లు వస్తాయి. షెడ్యూల్‌-4 కింద కొండముచ్చు కోతులు తదితరవి వస్తాయి. చూడ్డానికి ఈ చట్టం ఘనంగా ఉన్నా అరెస్టయిన వెంటనే ఈ కేసుకు బెయిల్‌ మంజూరు చేస్తుండడంతో నేరగాళ్లకు భయం లేకుండా పోయింది.

జీవ వైవిధ్య చట్టం

భారత ప్రభుత్వం జీవ వైవిధ్య చట్టాన్ని 2002లో అ మలు చేసింది. 2003 ఫిబ్రవరి 5వ తేదీన ప్రకటించింది. భారత దేశానికి వర్తింప చేస్తూ జీవ వనరులపై సార్వభౌమాధికారం హక్కులను పునరుద్ఘాటించింది. భారత ప్ర భుత్వం 62వ భాగం కింద 2004లో జీవ వైవిధ్య నియమావళిని జారీ చేసింది. 2009లో భారత ప్రభుత్వం 63వ నియమం కింద ఆంధ్రప్రదేశ్‌ జీవ వైవిధ్య నియమావళిని రూపొందించింది. 22వ నియామం జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను విస్తరింప చేసి ప్రకృతి సంరక్షణే జీవ వైవిధ్యం.

జంతువులను వేటాడితే..

షెడ్యూల్‌-1 కింద ఉన్న జంతువులను వేటాడితే 1972 సెక్షన్‌ 9 కింద కేసు నమోదు చేస్తారు. అడవిలో అనుమతి లేకుండా ప్రవేశించిన ఐదు రకాల కేసులు నమోదు చేస్తారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్‌ 27 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఆయుధాలతో అడవిలోకి వెళితే వారిపై సెక్షన్‌ 32 ప్రకారం శిక్ష అమలు చేస్తారు. 2002లో జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం కింద అ రుదైన సంరక్షణ సంచరించే ప్రాంతాల్లో అనుమతి లేకుం డా వెళితే శిక్షలు విధిస్తారు. 2006లో సెక్షన్‌- 51 సీ ప్రకా రం అడవిలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్ల లోపు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వన్యప్రాణులను వేటాడితే ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 నుంచి 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంతేగానీ నేరస్తులను కొంతకాలం జైళ్లలో ఉంచేందుకు ఈ చట్టాలు పనికి రాకపోవడంతో అటవీశాఖాధికారులు ఇబ్బందులెదుర్కొంటున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...