ఘనంగా పివి జయంతి వేడుకలు
కూకట్ పల్లి, పెన్ పవర్
కె.పి.హెచ్.బి కాలని మూడోపేజ్ కట్టావారి సేవాకేంద్రం వద్ద సోమవారం భారత మాజీ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు శత జయంతి వేడుకలను నిర్వహించారు. మహానుభావుల జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా నరసింగరావు పీవీ నరసింహ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతిని ఈసంవత్సరమంతా శతజయంతి ఉత్సవాలుగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపునివ్వటం యావత్ భారతజాతికే గర్వకారణమని, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగు వాడు పీవీ నరసింహారావని, ఆయన బహు భాషావేత్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందరని, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఆర్ధిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించారని, తన యొక్క రాజకీయ జీవితాన్ని 1938లో మొదలుపెట్టి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని గడిపారని, ఎమ్మెల్యే స్ధాయి నుంచి కేంద్ర క్యాబినెట్ లో అనేక పదవులను అలంకరించి ప్రధానమంత్రి స్థానానికి ఎదిగారని, అలాంటి మహోన్నత వ్యక్తి మన తెలుగు వాడు కావడం, అందునా తెలంగాణ ముద్ధు బిడ్డ కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమములో గుర్నాధరావు, కొల్లా శంకర్, పిడికిటి గోపాల్ చౌదరి, కొండూరు నారాయణ రాజు, ఎస్ రఘురామ్, రామసహాయం బుచ్చిరెడ్డి, క్రిస్టోఫర్, శ్రీనివాస్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment