పేద ప్రజలకు అండగా తెలుగుదేశం పార్టీ - అదితి గజపతిరాజు
విజయనగరం,పెన్ పవర్
పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటూ, వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అదితి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం 7వ డివిజన్లో, సాయంత్రం 36వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ కార్పొరేషన్ లో పన్నులను పెంచుతూ వైకాపా ప్రభుత్వం జీవోలను జారీ చేసిందన్నారు. పెంచిన పన్నులను తగ్గించేవరకు తెలుగుదేశం పార్టీ తరపున పోరాటం చేస్తామన్నారు. నిత్యవసర ధరలు పెరగడంతో సామాన్యుల జీవనం దుర్భరమైందన్నారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని వాలంటీర్లు ద్వారా బెదిరింపులు చేయడం దారుణమన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వైకాపా నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌ను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. వైకాపా అవినీతి పాలను ప్రజలు బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, మేయర్ అభ్యర్ధి కంది శమంతకమణి, మాజీ మున్సిపల్ చైర్మన్లు ప్రసాదుల రామకృష్ణ, ప్రసాదుల కనకమహాలక్ష్మి, 36 డివిజన్ టీడీపీ కార్పొరేట్ అభ్యర్ధి బమ్మిడి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment