Followers

ఎన్నికల విధుల్లో సేవాతత్పరులకు ప్రశంసలు, అభినందనలు - ఎస్పీ బి.రాజకుమారి

 ఎన్నికల విధుల్లో సేవాతత్పరులకు ప్రశంసలు, అభినందనలు - ఎస్పీ బి.రాజకుమారి

విజయనగరం, పెన్ పవర్

విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి 13, 17 మరియు 21 వ తేదీలలో జరిగిన మూడు విడతల పంచాయితీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు రాజ్యాంగ బద్దమైన తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొనుటలో మానవతాదృక్పదం, సేవా భావంతో సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందిని విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి జిల్లా పోలీసుకార్యాలయంలో ఫిబ్రవరి 25, గురువారం నాడు ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. రాజకుమారి మాట్లాడుతూ - గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నడు లేని విధంగా శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టిగా తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. అందరూ సమిష్టిగా పని చేయడం వల్లనే రాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్, విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు మరియు ప్రజలు, అన్ని వర్గాల నుండి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు లభించిందన్నారు. ఇదే విధమైన స్ఫూర్తిని, సమిష్టిగా పని చేసే విధానాన్నిమున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కూడా చూపించి,జిల్లాకు మరింత మంచి పేరు తేవాలన్నారు. మూడు విడతలుగా జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకొనుటలో అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులు తమవంతు సహాయ, సహకారాలను అందించారన్నారు. వృద్ధులను, దివ్యాంగులను తమ చేతులతోను, కుర్చీలో కూర్చుండ బెట్టుకొని మోస్తూ, పోలింగు కేంద్రాల వద్దకు చేర్చడం, ఓటు వేసిన తరువాత వారిని తిరిగి వాహనాల వరకు చేర్చడం వలన ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగించిందన్నారు. పోలీసులంటే తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించే వారే కాదు మానవత్వం, సేవా భావంతో వ్యవహరించే మన స్నేహితులన్న భావనను ప్రజల్లో కలిగించి నందుకు పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. సేవా భావంతో, మానవత్వంతో పని చేసిన పోలీసు అధికారులను,సిబ్బందికి జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.ప్రశంసా పత్రాలు పొందిన అధికారుల్లో ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, గజపతినగరం సిఐ డి. రమేష్, కొత్తవలస సిఐ జి.గోవందరావు,జామి ఎస్ఐ ఎస్. సుదర్శన్, సాలూరు పట్టణ ఎస్ఐ షేక్ ఫకృద్దీన్, బలిజిపేట ఎస్ఐ ఎ.నరేష్, కంట్రోల్ రూం ఎస్ఐ ఎ.మహేశ్వరరాజు, విజయనగరం రూరల్ ఎస్ఐ పి.నారాయణరావు, గజపతినగరం ప్రొబేషనరీ ఎస్ఐ నసీమా బేగం మరియు సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, ఎస్టీఎఫ్, సంగార్డు విభాగాలకు చెందిన వివిధ కేడర్లకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు, విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ. సుభాష్, సిసిఎస్ డిఎస్పీ జె. పాపారావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీలు ఆర్. శ్రీనివాసరావు, పి. రామారావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సిఐలు జి.రాంబాబు, ఎన్. శ్రీనివాసరావు, రుద్రశేఖర్,డిసిఆర్ బి సిఐ బి. వెంకటరావు, 1వ పట్టణ సిఐ జె.మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు, రూరల్ సీఐ టి.ఎస్.మంగవేని, సాలూరు సిఐ అప్పలనాయుడు, బొబ్బిలి సీఐ కె.కేశవరావు, గజపతినగరం సిఐ డి.రమేష్, కొత్తవలస సిఐజి.గోవిందరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...