Followers

అంగన్వాడీ టీచర్ పై దాడి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

అంగన్వాడీ టీచర్ పై దాడి   దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ ఆందోళన

పరవాడ, పెన్ పవర్

మండలం లో గల ముత్యాలమ్మ పాలెం లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ టీచర్ ముత్యాల రాణి అదే గ్రామానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కక్ష కట్టి దౌర్జన్యం చేయడం పట్ల ఈరోజు పరవాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ హెల్పర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ శేషు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు బి ఎల్ ఓ విధులు నిర్వహిస్తే దీనిని తప్పుగా చూపించి రెండో వైసిపి వర్గానికి చెందిన వారు అంగన్వాడి సెంటర్ లో ప్రవేశించి దౌర్జన్యం చేయడం వారి కుటుంబ సభ్యులను భయ బ్రాoతులకు గురిచేయడం అన్యాయమన్నారు వెంటనే దాడి చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి నాయకులు ఇష్టానుసారంగా రెచ్చిపోయి స్కీమ్ వర్కర్ల పై దౌర్జన్యానికి పాల్పడటం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు సీపీకి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ విధులు నిర్వహించే ఉద్యోగులకు రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. అనంతరం తాసిల్దార్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ నాయకులు కే రమణ, సిహెచ్ దేవి, వి వి రమణమ్మ, పార్వతి, వరలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు తాసిల్దార్ ఈ ఫిర్యాదుపై పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగిందని మరోసారి పోలీస్ అధికారుల దృష్టికి ఫిర్యాదును పంపించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...