కలియుగ వైకుంఠ వాసుని దర్శనార్ధమై బారులు తీరిన భక్తులు
ఆత్రేయపురం, పెన్ పవర్
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం లో వెలిసిన శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ ఈ ఆలయనికి ఒక విశిష్టత ఉంది వెంకన్న కు శనివారం పర్వదినం వెంకన్న దర్శనానికి 7 శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు పొందుతారని భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని ఒక ప్రగాఢ నమ్మకం ఈ సన్నిధిలో స్వామివారి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి ఆ స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది.దూర ప్రాంతాల నుండి కాళ్ళ నడకతో వచ్చే భక్తులు శుక్రవారం సాయంత్ర సమయానికి ఆలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ సిబ్బంది ఆ భక్తులకు భోజన వసతులు కల్పించి వారు సేద తీర్చుకునే విధంగా ఏర్పాట్లు చేశారు
స్వామివారి దర్శనానికి ఉదయం నుండే క్యూలైన్లలో నిలబడిన ఆ వైకుంఠ వాసుని దర్శన భాగ్యం పొందడానికి గోవిందా గోవిందా అని నామ స్వరం తో ఆలయమంతా మారుమోగుతుంది.
No comments:
Post a Comment