అధికారమివ్వండి ... అభివృద్ది చేసి చూపిస్తా
24వ వార్డులో వైసిపి అభ్యర్ధి ఏకా శివప్రసాద్
నర్సీపట్నం పెన్ పవర్
నర్సీపట్నం మున్సిపాలిటీ 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకా శివప్రసాద్ , తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. సహజంగా సౌమ్యుడు, పట్టభద్రుడైన ఏకా శివప్రసాద్ కు వార్డులో మంచి పేరుంది. కరోనా వంటి కష్టకాలంలో పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేయడంతోపాటు, గత రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే అండదండలతో వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వార్డు అవసరాలకోసం చిన్న చిన్న పనులు, తన సొంత నిధులతో పూర్తి చేస్తూ, వార్డు ప్రజల మన్ననలు పొందుతూ వచ్చారు. ప్రస్తుతం 24వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏకా శివప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే అండదండలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తానని భరోసా ఇస్తున్నారు. వార్డు సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, ఒక్క అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సహకారంతో వార్డు సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని శివప్రసాద్ హామీ ఇస్తున్నారు.
No comments:
Post a Comment