తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చో డానికి కారణం మేం కాదా
టీజెఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం
నెల్లికుదురు,పెన్ పవర్.
కేసీర్ సార్ మీరు కుర్చీలో కూర్చో డానికి కారణం మేం కాదా?అయినప్పుడు ప్రజల అవసరాలకు కావలసినవి మేం అడుగుతే తప్పేంటి?అని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహుబూబబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్లో హాజరైన పట్టభద్రులు, ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం అణచివేత ధోరణి పాల్పడుతోందని ఇదేమిటని అడిగితే అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారో కనీసం చెప్పకపోవడం దారుణమన్నారు.నీళ్లు నియామకాలు నిధుల కోసం ఏర్పడిన తెలంగాణలో ఇంతవరకు ఏమి నెరవేర లేదన్నారు.తాము పదవుల కోసం మాట్లాడడం లేదని పదవి కావాలంటే ఏనాడో అడిగి తీసుకునే వాడిని అని జయశంకర్ సార్ కోరిక మేరకే ప్రజల పక్షాన కొట్లాడుతున్న అన్నారు.ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దగా చేస్తోందని నియంత్రిత సాగు పేరుతో రైతుల ను ఇబ్బంది పెట్టిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.ఉద్యోగులకు నిరుద్యోగులు వెరసి అన్ని వర్గాల ప్రజల పక్షాన మరింతగా పోరాడి సమస్యలను సాధించుకోవడానికి తమకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.అనంతరంస్థానిక ప్రభుత్వ కళాశాల పాఠశాలలో నీ అధ్యాపకులు ఉద్యోగులను తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు . ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు డోలి సత్యనారాయణ,నాయకులు పిల్లి సుధాకర్ ఆరుద్ర పరమాత్మ చారి ఇరుగు మనోజ్ రాజ కు మార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment