విద్యుత్ సమస్యలపై స్పందించిన మంత్రి
వనపర్తి , పెన్ పవర్
వనపర్తి పట్టణంలోని 30 వా వార్డులో విద్యుత్తు సమస్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వినతి పత్రం సమర్పించారు. స్పందించిన మంత్రి హుట హుటిన విద్యుత్ డి.ఇ., ఏ.డి.ఇ., ఏ.ఇ.లను వార్డు లో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే తీర్చాలని ఆదేశించడంతో ఉదయం డి.ఇ. నరేంద్ర కుమార్, ఎ. ఇ. రాజా గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తో కలసి 30 వ వార్డు లో ఉన్న జంగిడిపూరం,ఐజయ్యకాలనీ, సాయినగర్, రాజీవ్ గృహకల్ప పరిసరాలను కాలినడకన మొత్తం తిరిగి వార్డులో లెలకొన్న విద్యుత్తు సమస్యలను తెలుసుకున్నారు. లోఓల్టేజ్, నుతన లైన్ల ఏర్పాటు నూతన ట్రాన్స్ఫార్మర్ లను ఏర్పాటు గుర్తించి వెంటనే తీర్చాలని ఆదేశించారు. డి.ఇ. సానుకూలంగా స్పందించి వెంటనే తీరుస్తానని చెప్పడం జరిగిందని, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, డి.ఇ. నరేందర్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment